- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. డీజీపీ సమక్షంలో 11 మంది సరెండర్
ఒడిశా డీజీపీ వై.బి. ఖురానియా సమక్షంలో DCM నకుల్ సహా 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఇవాళ ఒడిశాలోని కలహాండి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ వై.బి. ఖురానియా సమక్షంలో డివిజనల్ కమిటీ సబ్యుడు నకుల్ సహా మొత్తం11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు (ACM), మరో ఐదుగురు పార్టీ క్యాడర్లు ఉన్నారు. వీరంతా ఒక AK-47 రైఫిల్, ఒక ఇన్‌సాస్ (INSAS), నాలుగు ఎస్ఎల్ఆర్ (SLR) రైఫిళ్లు, నాలుగు సింగిల్ షాట్ తుపాకులు, భారీగా మందుగుండు సామాగ్రిని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రకు చెందిన నకుల్ ఒడిశా రాష్ట్ర కమిటీలో DCMగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇతనిపై రూ. 22 లక్షల రివార్డు ఉంది. ఈ మావోయిస్టు బృందం బసధారా–ఘుమ్షార్–నాగాబలి డివిజన్ పరిధిలో పనిచేస్తూ కలహాండి, రాయగడ, కంధమాల్ జిల్లాల్లో చురుకుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నకుల్ మహారాష్ట్రకు చెందినవాడు కాగా, మిగతా సభ్యులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు.






