- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Assam: పాకిస్తాన్ అనుకూలంగా పోస్టు చేసినందుకు అస్సాంలో 11 మంది అరెస్టు
అవసరమైతే వీరిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. దీంతో ఈ కారణంతో రాష్ట్రంలో మొత్తం అరెస్టుల సంఖ్య 11కి చేరుకుంది. అవసరమైతే వీరిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కేసు నమోదు చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. 'భారత్, పాకిస్తాన్ మధ్య ఎలాంటి సారూప్యతలు లేవు. రెండు దేశాలు శత్రు దేశాలు, మనం అలాగే ఉండాలి' అని హిమంత బిస్వ శర్మ ఇక్కడ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో అన్నారు. దేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల కారణంగా కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి నేతను అరెస్ట్ చేశామని, అటువంటి దృక్పథం ఉన్న ఎవరైనా సరే ఊచలు లెక్కపెట్టక తప్పదని హిమంత్ స్పష్టం చేశారు. తాము అన్ని సోషల్ మీడియా పోస్టులను పరిశీలిస్తున్నాం. దేశానికి వ్యతిరేకంగా స్పందించే వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఎన్ఎస్ఏ నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. శ్రీభూమి జిల్లాలో ఒకరిని, కాచర్ జిల్లాలో నలుగురు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కారణాలతో అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. అంతకుముందు శుక్రవారం కూడా ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు హిమంత్ శర్మ పేర్కొన్నారు.






