- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Covid cases: దేశంలో పెరుగుతున్న కరోనా.. వెయ్యికి పైగా యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతున్నాయి. ప్రస్తతం వెయ్యికి పైగా కరోనా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గత వారంలో 752 కొత్త కేసులు నమోదైనట్లు పేర్కొంది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతున్నాయి. ప్రస్తతం వెయ్యికి పైగా కరోనా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గత వారంలో 752 కొత్త కేసులు నమోదైనట్లు పేర్కొంది. గతవారం అత్యధికంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో కొత్త ఇన్ఫెక్షన్లు నమోదైనట్లు వెల్లడించింది. కేరళలో కొత్తగా 335 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 430కి చేరుకున్నాయి. మహారాష్ట్రలో 153, ఢిల్లీలో 99 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, మహారాష్ట్రలో 209 యాక్టివ్ కేసులు ఉండగా.. ఢిల్లీలో 104 యాక్టిన్ కేసులు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత గుజరాత్ లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్ లో 15 కేసులు, పశ్చిమ బెంగాల్ లో 12 కేసులు నమోదయ్యయాయి.
కేసుల పెరుగుదలపై..
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శనివారం కరోనా కేసుల పరిస్థితిని సమీక్షించారు. "కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుండి కేసులు నమోదయ్యాయని అన్నారు. చాలా కేసులు తేలికపాటివి, వారందరూ హోం ఐసోలేషన్ లో ఉన్నారని" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల కాలంలో ఆసియా దేశాలు మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్‌తో పాటు చైనాలోనూ కొవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. జేఎన్.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు, రెండు కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7లను భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) శనివారం వెల్లడించింది. ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్‌లో బయటపడగా.. ఎల్‌ఎఫ్.7 కు సంబంధించి నాలుగు కేసులు మేలో గుర్తించినట్లు తెలిపింది. వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని, దీంతోపాటు ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణంగా పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఆసియా దేశాల్లో కొవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న జేఎన్.1 రకం ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ మాత్రమేనని, ఆందోళన కలిగించే రకం (Variant of Concern) కాదని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవలే స్పష్టం చేసింది.






