BrahMos: ఏటా 100 నుంచి 150 బ్రహ్మోస్ క్షిపణుల తయారీ

by Shamantha N |

భారత్‌ (India), పాకిస్థాన్‌ (Pakistan) మధ్య ఉద్రిక్తతల వేళ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.

BrahMos: ఏటా 100 నుంచి 150 బ్రహ్మోస్ క్షిపణుల తయారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌ (India), పాకిస్థాన్‌ (Pakistan) మధ్య ఉద్రిక్తతల వేళ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. లక్నో సిటీలో బ్రహ్మోస్‌ క్షిపణి (BrahMos missile) తయారీ కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. లక్నోలోని ‘ఉత్తరప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌’లో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఇందులో ఆరు కీలక నోడ్‌లు ఉన్నాయి. లక్నో, కాన్పూర్, అలీగఢ్, ఆగ్రా, ఝాన్సీ, చిత్రకూట్ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. లక్నో యూనిట్ ఇప్పటికే ఉన్న సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను సమీకరించి పరీక్షిస్తుంది. తేలికైన, నెక్ట్ జనరేషన్ (NG) వేరియంట్‌లను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇవి భారతదేశ సాయుధ దళాల దాడి సామర్థ్యాలను పెంచుతాయి.

బ్రహ్మోస్ అంటే ఏమిటి?

బ్రహ్మోస్ క్షిపణిని భూమి, జల, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో, పగలు, రాత్రి ఇలా ఏ సమయంలోనా ఉపయోగించేలా రూపొందింది. ఈ క్షిపణిని ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌ గైడెన్స్‌ సిస్టమ్‌తో భూ ఉపరితలం నుంచి, సముద్ర తలం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. ఏడాదికి 80 నుంచి 100 బ్రహ్మోస్‌ క్షిపణులు తయారుచేసేలా ఈ ప్రొడక్షన్‌ యూనిట్‌ను డిజైన్‌ చేశారు. రూ.300 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. భారత్‌, రష్యాల సంయుక్త వెంచర్‌ అయిన బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్‌ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. కొత్తగా ప్రారంభమవుతున్న ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్‌ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం బ్రహ్మోస్‌ క్షిపణులు ఏడాదిలోగా డెలివరీకి సిద్ధం కానున్నాయి. ఈ న్యూజనరేషన్‌ బ్రహ్మోస్‌ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీని బరువును తగ్గించారు. ప్రస్తుత బ్రహ్మోస్‌ క్షిపణి బరువు 2900 కిలోలు కాగా, న్యూ బ్రహ్మోస్‌ క్షిపణి బరువు 1290 కిలోలు.

Next Story