- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam Attack: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ముష్కరుల ఇళ్ల పేల్చివేతలు
పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ముష్కరుల కోసం భద్రతాబలగాలు వేట కొనసాగిస్తున్నారు. ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితుల ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ముష్కరుల కోసం భద్రతాబలగాలు వేట కొనసాగిస్తున్నారు. ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితుల ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భద్రతా బలగాలు మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశాయి. గత ఆర్రోజుల్లోనే పది మంది ముష్కరులను ఇళ్లను అధికారులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. శనివారం ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా, కలరూస్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తద్వా, బందిపొరాలోని జమీల్ అహ్మద్ షేర్ గోజ్రీ, అమీర్ నజీర్ వాని ఇళ్లను శనివారం రాత్రి ధ్వంసం చేశాయి. ఉగ్ర స్థావరాలను గుర్తించడానికి శ్రీనగర్‌లోని 60కి పైగా ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు పన్నే కుట్రలను నిర్వీర్యం చేయడానికి సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. వారి ఇళ్లల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఆయుధాలు మొదలైన వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు పది మంది..
దేశంలో హింస, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడాలనుకునే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని..వారంతా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటివరకు ఇళ్ళు కూల్చివేసిన ఉగ్రవాదులలో లష్కరే తోయిబాకు చెందిన ఆదిల్ హుస్సేన్ థోకర్, జాకీర్ అహ్మద్ గనై, అమీర్ అహ్మద్ దార్, ఆసిఫ్ షేక్, షాహిద్ అహ్మద్ కుట్టే, అహ్సాన్ ఉల్ హక్ అమీర్ ఉన్నారు. అంతేకాకుండా జైషే మొహమ్మద్‌కు చెందిన అమీర్ నజీర్ వాని, జమీల్ అహ్మద్ షేర్ గోజ్రీ నివాసాలను ధ్వంసం చేశారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన అద్నాన్ సఫీ దార్, ఫరూక్ అహ్మద్ తద్వా ఇళ్లను ధ్వంసం చేశారు.






