- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. శిథిలాల కింద చిక్కుకున్న 10 మంది
రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్లు కొండచరియలు విరిగి పడుతున్నాయి. కలపను విచాక్షణరహితంగా నరకడంతోనే కొండచరియలు విరిగిపడుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలో క్లౌడ్ బస్టింగ్ జరిగిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ తరుణంలో ఉత్తరాఖండ్(UttarKhand)లోని ఉత్తర కాశీ జిల్లాలో క్లౌడ్ బరస్ట్(Cloud burst) సంభవించింది. దీని ప్రభావంతో బార్‌కోట్-యమునోత్రి మార్గంలోని సిలాయ్ బాంద్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ ధ్వంసమైంది. ఈ సమయంలో అక్కడే పదిమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక, ఒక్కసారిగా హోటల్ కూలిపోవడంతో పనిచేస్తున్న 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కోసం ఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.Link






