- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్తరకాశీలో మెరుపు వరదలు.. 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు
ఉత్తరాఖండ్(Uttarakhand) వరదల్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్(Uttarakhand) వరదల్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వరదల్లో(Floods) దాదాపు పది మంది ఆర్మీ జవాన్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ధరాలీ గ్రామంలో ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో క్యాంప్‌లో ఉన్న జేసీవో సహా మొత్తం పది మంది ఆర్మీ జవాన్లు గల్లంతు అయినట్లు వార్తలు విస్తృతం అయ్యాయి. మరోవైపు.. వరదల విషయం తెలిసిన వెంటనే అక్కడకు వచ్చిన ఆర్మీ జవాన్లు 20 మంది పౌరులను కాపాడారు. హర్షిల్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. ప్రస్తుతం ధరాలీ గ్రామంలో NDRF, SDRF సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 60 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని, 20-25 హోటళ్లు, నివాసాలు కొట్టుకుపోయి ఉండొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.






