- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priya Saroj : ఎంపీని పెండ్లి చేసుకోబోతున్న భారత క్రికెటర్..ఎవరా ఇద్దరూ !?
ఓ క్రికెటర్ సినిమా తారను చేసుకోవడం సాధారణంగా మారగా.. భారత యువ క్రికెటర్...హార్డ్ హిట్టర్ రింకు సింగ్ మాత్రం ఏకంగా ఓ రాజకీయ నాయకురాలిని వివాహాం చేసుకోబోతున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఓ క్రికెటర్ సినిమా తారను చేసుకోవడం సాధారణంగా మారగా.. భారత యువ క్రికెటర్...హార్డ్ హిట్టర్ రింకు సింగ్ మాత్రం ఏకంగా ఓ రాజకీయ నాయకురాలిని వివాహాం చేసుకోబోతున్నాడు. క్రికెట్ మైదానంలో భారీ షాట్లతో విరుచుకపడే రింకుసింగ్(Rinku Singh )వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతను తన జీవిత భాగస్వామిగా సమాజ్ వాది పార్టీ (Samajwadi Party) ఎంపీ ప్రియా సరోజ్(MP Priya Saroj)ను ఖరారు చేసుకున్నాడు. రింకూ సింగ్ పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ) ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. రింకూ, ప్రియా ఇద్దరూ ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు, త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారు.
ఇప్పుడు ఎంపీ ప్రియా సరోజ్ వివరాల కోసం నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. 1998లో జన్మించిన ప్రియా సరోజ్ మూడుసార్లు ఎంపీగా, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేగా ఉన్న తుఫానీ సరోజ్ కుమార్తె. ప్రియా సరోజ్ సమాజ్ వాది పార్టీ నుంచి లోక్ సభకు ఎన్నికవ్వగా..ఎంపీల్లో అతి పిన్న వయస్కులలో ఒకరు. ప్రియా సరోజ్ తన విద్యను ఢిల్లీలోని ఎయిర్ గోల్డెన్ జూబ్లీ ఇన్సిస్ట్యూట్ లో పూర్తి చేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ విభాగంలో బీఏ పూర్తి చేసింది. తరువాత ఆమేథీ విశ్వవిద్యాలయం నుంచి లా పూర్తి చేసి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ప్రియా సరోజ్ 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు.
ఇక రింకు ఖాంచంద్ సింగ్ 1997 ఆక్టోబర్ 12న జన్మించాడు. భారత జాతీయ క్రికెట్ జట్టుకు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో ఎంపికయ్యాడు. రింకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున, దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ లో 2023 ఆగస్టులో ఐర్లాండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రింకూ సింగ్ ఐదుగురు అన్నదమ్ముళ్లతో మూడో వాడు. అతని తండ్రి ఖాన్‌చంద్ర సింగ్ ఎల్‌పీజీ పంపిణీ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా పనిచేశాడు.
రింకూసింగ్ అండర్-16, అండర్-19, అండర్-23 స్థాయిలలో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అండర్-19 స్థాయిలో సెంట్రల్ జోన్ తరపున కూడా ఆడాడు . ఇతను 16 సంవత్సరాల వయస్సులో మార్చి 2014లో ఉత్తరప్రదేశ్ తరపున లిస్ట్ ఏ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 83 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. నవంబర్ 2016న 2016–17 రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. 2018-19 రంజీ ట్రోఫీ గ్రూప్-స్టేజ్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున అత్యధిక పరుగులు సాధించాడు. అతను పది మ్యాచ్‌లలో 953 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఐపీఎల్ లో తన ధనాధన్ షాట్లతో ఆకట్టుకుని మంచి మ్యాచ్ ఫినిషర్ గా గుర్తింపు పొంది ఇండియా టీమ్ లోకి ఎంపికయ్యాడు.






