అరేబియాలో అల్పపీడనం.. 4 రాష్ట్రాలకు భారీ వర్షసూచన

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-23 03:13:54  IST  )

అరేబియా సముద్రం (Arabia Beach)లో అల్పపీడనం (Low Pressure) ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

అరేబియాలో అల్పపీడనం.. 4 రాష్ట్రాలకు భారీ వర్షసూచన
X

దిశ, వెబ్‌డెస్క్: అరేబియా సముద్రం (Arabian Sea)లో అల్పపీడనం (Low Pressure) ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) కేరళను తాకనుండగా.. ఈనెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ (IMD) అంచనా వేసింది. వీటి ప్రభావంతో ఏపీలో రెండ్రోజులపాటు, తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణాజిల్లాల్లో భారీవర్షాలు, పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరదిశగా కదులుతూ.. శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులు వాయుగుండానికి అనుకూలిస్తే.. తీవ్ర వాయుగుండం (Deep Depression) లేదా తుపాను (Cyclone)గా బలపడే అవకాశాలున్నాయని చెప్పింది. దీని ప్రభావంతో రానున్న 6 రోజుల్లో గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy to Heavy Rains) కురుస్తాయని పేర్కొంది.

27న మరో అల్పపీడనం ఏర్పడితే రెండ్రోజుల్లో బలపడి.. బంగ్లాదేశ్, మయన్మార్ వైపుగా వెళ్తుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈనెల 26,27 తేదీల్లో ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Next Story