హార్డ్ డిస్క్ లో 15 మంది మహిళల నగ్న చిత్రాలు... సివిల్స్ అభ్యర్థి హత్య కేసులో విస్తుపోయే విషయాలు

by Prasad Jukanti |

ఢిల్లీలో సంచలనం సృష్టించిన ప్రియుడి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

హార్డ్ డిస్క్ లో  15 మంది మహిళల నగ్న చిత్రాలు... సివిల్స్ అభ్యర్థి హత్య కేసులో విస్తుపోయే విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్‍కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి రామ్ కేశ్ మీనా (32) (Ram Kesh Meena) హత్య కేసులో విస్తుపోయే విషయాన్ని పోలిసులు గుర్తించారు. ఈనెల 6వ తిమార్ పుర్ రామ్ కేశ్ మీనాను అతడి ప్రియురాలు ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ విద్యార్థిని అమృతా చౌహాన్‌(21) (Amrita Chauhan) తన మిగతా స్నేహితులతో కలిసి సినిమాటిక్ లెవల్‍లో హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో భారీ కుట్రను గుర్తుంచారు. రామ్‍కేశ్ హత్య తర్వాత అతడి గదిలో నుంచి అమృత ఎత్తుకెళ్లిన హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న డేటా చూసి షాక్‍కు గురయ్యారు. రామ్ కేశ్ మీనా తన ప్రియురాలు అమృత ప్రైవేట్ వీడియోలతో పాటు మరో 15 మంది మహిళల నగ్నవీడియోలు (Nude videos) రికార్డు హార్డ్ డిస్క్ లో సేవ్ చేసి పెట్టుకున్నట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. మహిళల నగ్న చిత్రాలు, వీడియోలను రికార్డు చేసి సేవ్ చేసుకునే కోరిక అతనికి ఉందని ఈ వక్రబుద్ధే అతడి హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. అయితే మిగతా మహిళలెవరూ రామ్ కేశ్ మీనా పై ఫిర్యాదు చేయకపోవడంతో ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లబోవడం లేదని మహిళల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం అని పోలీసులు వెల్లడించారు.

తన వీడియోలు ఇంటర్నెట్ లో పెడతారనే భయంతో..

రామ్ కేశ్ మీనా, అమృత ఇద్దరు గతంలో ప్రేమించుకున్నారు. ఆ సమయంలో అమృత ప్రైవేట్ వీడియోలను రామ్ కేశ్ రికార్డు చేశారు. అయితే వాటిని తొలగించేందుకు అంగీకరించలేదు. దాంతో ఎక్కడా ఆ వీడియోలను ఇంటర్నెట్‍లో అప్ లోడ్ చేస్తాడో అనే ఆందోళన చెందిన అమృత.. తన మాజీ ప్రియుడు, మరో స్నేహితుడితో కలిసి ఈ నెల 6వ తేదీన రామ్ కేశ్ మీనాను ఆయన గదిలోనే చంపేసి అతడి వద్ద ఉన్న హార్డ్ డిస్క్ ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత సిలిండర్ పేలి చనిపోయినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసులు సైతం తొలుత ప్రమాదం కారణంగానే రామ్‍కేశ్ చనిపోయాడని భావించినా ఘటన స్థలంలోని పరిస్థితులు మరోరకంగా ఉండటంతో అనుమానించారు. ఈ క్రంమలో సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించగా అమృత ఆమె స్నేహితులు రామ్ కేశ్ మీనా గదికి వెళ్లడాన్ని గుర్తించారు.

మిగత బాధితులెవరు?:

కాగా రామ్‍కేశ్ మీనా హార్డ్ డిస్క్ లో మొత్తం 15 మంది మహిళల వీడియోలు కనుగొనబడ్డాయని పోలీసులు ధృవీకరించడంతో రామ్‍కేశ్ బారిన పడిన మిగతా బాధిత మహిళలు ఎవరు అనేది సంచలనంగా మారింది. పైకి సివిల్స్ సర్వీసెస్ అభ్యర్థిగా మంచివాడిగా నటిస్తూ ఎవరెవరిని మోసగించాడనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ నగ్న వీడియోల వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరేదైనా కుట్రకోణం వెలుగులోకి రానుందా అనేది ఉత్కంఠగా మారింది.

Next Story