- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణుగూరులో ఘనంగా జాతీయ జర్నలిస్ట్ డే వేడుకలు
by Sridhar Babu |
<p>దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని వేణు రెస్టారెంట్ హాల్‌లో జాతీయ జర్నలిస్ట్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ప్రెస్ క్లబ్ సెక్రటరీ మాచర్ల శ్రీను ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చందు పూజారి, సెక్రటరి మాచర్ల శ్రీను మాట్లాడుతూ.. ముందుగా జర్నలిస్టులందరికీ జాతీయ జర్నలిస్ట్ శుభాకాంక్షలు తెలిపారు. వార్త కథనాలపై మెళుకువలను నేర్పించారు. జర్నలిస్టులు నిర్భయంగా వార్తలు ప్రచురించాలని సూచించారు. ప్రతి జర్నలిస్టుకి ప్రెస్ క్లబ్ […]</p>

X
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని వేణు రెస్టారెంట్ హాల్‌లో జాతీయ జర్నలిస్ట్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ప్రెస్ క్లబ్ సెక్రటరీ మాచర్ల శ్రీను ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చందు పూజారి, సెక్రటరి మాచర్ల శ్రీను మాట్లాడుతూ.. ముందుగా జర్నలిస్టులందరికీ జాతీయ జర్నలిస్ట్ శుభాకాంక్షలు తెలిపారు. వార్త కథనాలపై మెళుకువలను నేర్పించారు. జర్నలిస్టులు నిర్భయంగా వార్తలు ప్రచురించాలని సూచించారు. ప్రతి జర్నలిస్టుకి ప్రెస్ క్లబ్ తోడుగా ఉంటుందన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ పేరుతో ఉన్న జ్ఞాపికలను అందజేశారు. తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ సలహాదారులు కూర్రం విజయ్, దామల్ల వెంకన్న, దాసరి వెంకట్ తదితర జర్నలిస్టులందరూ పాల్గొన్నారు.
- Tags
- Manuguru
Next Story






