'పుష్ప’ విలన్‌గా నేషనల్ అవార్డు విన్నర్

by  |
పుష్ప’ విలన్‌గా నేషనల్ అవార్డు విన్నర్
X

దిశ, సినిమా: ‘ఆర్య, ఆర్య2’ చిత్రాల తర్వాత సుకుమార్, బన్ని కాంబోలో వస్తోన్న మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో విలన్‌గా ఎవరు నటిస్తున్నారన్న విషయమై కొద్ది రోజులుగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టాయి. ‘డిస్కో‌రాజా, కలర్ ఫొటో’ సినిమాల్లో విలన్ రోల్ ప్లే చేసిన కమెడియన్ సునిల్ ‘పుష్ప’లో నటిస్తారని వార్తలొచ్చాయి. ఇంకా పలువురి పేర్లు తెరపైకి రాగా వాటన్నిటికీ చెక్ పెడుతూ మైత్రి మూవీ మేకర్స్ విలన్‌గా ఎవరు నటిస్తున్నారో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు.

టాలెంటెడ్ మాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ ఫహద్ ఫాజిల్ ‘పుష్ప’లో విలన్‌గా నటిస్తున్నారని ప్రకటించారు. మలయాళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ విలక్షణ శైలి ఏర్పరుచుకున్న హీరో ఫహద్. ‘ట్రాన్స్’ చిత్రంలో ఆయన తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక ‘పుష్ప’లో సుకుమార్ క్రియేట్ చేసిన విలన్ రోల్ ద్వారా ఫహద్ పాన్ ఇండియా యాక్టర్‌గా మారే అవకాశాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన క్యూట్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తుండగా, దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.



Next Story