ఆ గ్రహశకలం.. ఓ బంగారు నిధి!

by  |
ఆ గ్రహశకలం.. ఓ బంగారు నిధి!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఓ బంగారు నిధి’ దొరికితే చాలు.. కష్టాలన్నీ తీరిపోయి వెంటనే కోటిశ్వరులైపోవచ్చని ఏదో ఒక సమయంలో అనుకోనివారుండరు. నిజంగానే అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) అలాంటి ఓ నిధి లాంటి ఖనిజాలున్న ‘ఆస్టరాయిడ్’పై పరిశోధన చేయనుంది. ఇందుకోసం ‘సైక్ స్పేస్ క్రాఫ్ట్‌ను అంతరిక్షంలో ఉన్న పెద్ద గ్రహశకలం 16 సైక్(Asteroid 16 Psyche) దగ్గరకు పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ ఫేజ్‌ను పాస్ అయినట్లు నాసా తెలిపింది.

226 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ‘16 సైక్ ఆస్టరాయిడ్’.. బుధ గ్రహానికి, బృహస్పతికి మధ్యలో ఉందని తెలుస్తోంది. ఈ గ్రహశకలంలో అత్యంత విలువైన లోహాలు, ఖనిజాలు ఉన్నాయని.. వీటి విలువ 10,000 క్వాడ్రిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటుదని నిపుణుల అంచనా. సాంకేతికంగా సంఖ్యాపరంగా చెప్పాలంటే దీని విలువ నగదును భూమిపై ఉన్న ప్రతి మనిషికి పంచితే బిలియనీర్లు అవుతారని అభిప్రాయపడ్డారు. ఈ గ్రహశకలాన్ని అధ్యయనం చేయడంతో పాటు ఇతర గ్రహాలు, భూమి ఎలా ఏర్పడ్డాయనే విషయాన్ని తెలుసుకోనున్నామని నాసా చెప్తోంది. ఇదే ఉద్దేశ్యంతో స్పేస్ ఏజెన్సీ ‘సైక్ స్పేస్ క్రాఫ్ట్‌’ను రెడీ చేసింది. దీన్ని 2022 ఆగస్టులో లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తోన్న నాసా.. ఆ స్పేస్ క్రాఫ్ట్ 2026వరకు సైక్ ఆస్టరాయిడ్‌ను చేరుకుంటుందని చెబుతోంది. సైక్ స్పేస్ క్రాఫ్ట్ దాని మాగ్నోమీటర్‌ను ఉపయోగించి, ఆస్టరాయిడ్ మాగ్నటిక్ ఫీల్డ్‌ను మెజర్ చేస్తుందని, అయితే ఈ మిషన్‌ను అరిజోనా స్టేట్ యూనివర్సిటీ లీడ్ చేయనున్నట్లు నాసా తెలిపింది. ఈ సైక్ ఆస్టరాయిడ్‌ను 1852, మార్చి 17న ఇటాలియన్ ఆస్ట్రోనామర్ అన్నీబలే డి గాస్పరిస్ డిస్కవర్ చేశారు.



Next Story