చిన్నారుల దుర్మరణం.. విషాదంలో ప్రధాని మోడీ

by  |
చిన్నారుల దుర్మరణం.. విషాదంలో ప్రధాని మోడీ
X

దిశ,వెబ్‌డెస్క్:మహరాష్ట్ర బాంద్రా జిల్లాకి చెందిన స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ లో 17మంది చిన్నారులకు ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 2గంటల సమయంలో చిన్నపిల్లలున్న వార్డ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు 7 చిన్నారులు ఊపిరాడక దుర్మరణం చెందారు. మిగిలిన చిన్నారుల్ని ప్రమాదం నుంచి కాపాడి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

అయితే ప్రమాదానికి గురైన చిన్నారుల్లో నెలరోజులు, మూడు నెలల వయస్సున్న చిన్నారులు ఉన్నారని, వారిలో 7మంది ఊపిరాడక మరణించినట్లు బాంద్రా జిల్లా సివిల్ సర్జన్ ప్రమోద్ ఖండతే తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తో పాటు ఆస్పత్రి సిబ్బంది వీలైనంత త్వరగా మంటల్ని అదుపులోకి తెచ్చినట్లు డాక్టర్ ఖండతే చెప్పారు. ప్రమాదానికి కారణం ఏంటనే విషయంపై స్పష్టత లేనప్పటికి.. మంటలకు షార్ట్ సర్య్కూటే కారణమని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదంతో చిన్నపిల్లల వార్డ్ తో పాటు ఇతర వార్డులలో ఉన్న రోగుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు చెప్పారు.

మరోవైపు ప్రమాదంపై సీఎం ఉద్దవ్ ఠాక్రే.., హెల్త్ మినిస్టర్ రాజేష్ తోపేతో మాట్లాడారు. ఈ విషాదంపై త్వరితగతిన దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించించారు. కాగా ప్రమాదం పై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ చిన్నారులు త్వరలోనే కోలుకోవాలని ట్వీట్ చేశారు. చిన్నారుల మరణం త‌న‌ను క‌ల‌చి వేసింద‌న్న‌ మోడీ.., చిన్నారుల కుటుంబాలకు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయాల‌పాలైన చిన్నారులు త్వ‌ర‌గా కోలుకోవాలని ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed