- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో మత్తు ఇంజక్షన్ల కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో డ్రగ్స్ స్మగ్లింగ్ పెరిగిపోతోంది. గంజాయి సరఫరాతో పాటు నిషేధిత డ్రగ్స్ స్మగ్లింగ్‌పై అధికారులు కొరడా ఝులిపిస్తున్నప్పటికీ.. పలువురు మాత్రం అదే పనిగా విక్రయాలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో శుక్రవారం తనిఖీలు చేపట్టిన అధికారులు.. భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 1,500 మత్తు ఇంజక్షన్లు, 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నది పాత నేరస్థుడైన నక్కా మహేశ్‌గా గుర్తించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో డ్రగ్స్ స్మగ్లింగ్ పెరిగిపోతోంది. గంజాయి సరఫరాతో పాటు నిషేధిత డ్రగ్స్ స్మగ్లింగ్‌పై అధికారులు కొరడా ఝులిపిస్తున్నప్పటికీ.. పలువురు మాత్రం అదే పనిగా విక్రయాలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో శుక్రవారం తనిఖీలు చేపట్టిన అధికారులు.. భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 1,500 మత్తు ఇంజక్షన్లు, 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నది పాత నేరస్థుడైన నక్కా మహేశ్‌గా గుర్తించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఫేక్ అడ్రస్‌తో ఇంజక్షన్లు తీసుకొచ్చినట్టు గుర్తించారు. గతంలోనూ నిందితుడు మత్తు ఇంజక్షన్లను సరఫరా చేస్తూ దొరికినట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story






