- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులు కన్నీరు పెడుతున్నారు…ఆదుకోండి: లోకేశ్
<p>లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులు కన్నీరు పెడుతున్నారని, వారిని ఆదుకోవాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. దాని వివరాల్లోకి వెళ్తే.. ట్విట్టర్ మాధ్యమంగా ప్రభుత్వానికి సూచన చేసిన లోకేశ్ …’రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం అంటోంది. కానీ క్షేత్రస్థాయిలో రైతులు కన్నీరు పెడుతున్నారు. అప్పులు చేసి పండించిన పంటకి మద్దతు ధర రావడం లేదు. కనీసం వేరే ప్రాంతాలకు తరలించడానికి రవాణా సౌకర్యం కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు’ […]</p>

లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులు కన్నీరు పెడుతున్నారని, వారిని ఆదుకోవాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. దాని వివరాల్లోకి వెళ్తే.. ట్విట్టర్ మాధ్యమంగా ప్రభుత్వానికి సూచన చేసిన లోకేశ్ …’రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం అంటోంది. కానీ క్షేత్రస్థాయిలో రైతులు కన్నీరు పెడుతున్నారు. అప్పులు చేసి పండించిన పంటకి మద్దతు ధర రావడం లేదు. కనీసం వేరే ప్రాంతాలకు తరలించడానికి రవాణా సౌకర్యం కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ,
‘హార్టి కల్చర్, ఆక్వా రంగంలో ఉన్న రైతుల కష్టాలు వర్ణనాతీతం. కూలీలు, గిట్టుబాటు ధర లేక వరి పండించిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒక్క సారి రైతు దెబ్బ తింటే కోలుకోవడం చాలా కష్టం. వీలైనంత త్వరగా స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను’ అంటూ ట్విట్టర్ మాధ్యమంగా సూచించారు.
Tags: nara lokesh, tdp, ap, twitter, agriculture






