పచ్చ చొక్క అందుకే ధరించలేదు: లోకేశ్

by  |
పచ్చ చొక్క అందుకే ధరించలేదు: లోకేశ్
X

దిశ ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా వినూత్నంగా నిర్వహిస్తున్న మహానాడుకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చినబాబు నయాలుక్‌తో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముద్దుగా బొద్దుగా ఉండే లోకేశ్ బాబు చాలా స్లిమ్‌గా కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

రెండు నెలల్లోనే ఇంత మార్పు ఎలా టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. మీడియా వర్గాలు నేరుగా ఆయననే అడిగేశాయి. ఇంత మార్పు ఎలా సాధ్యమైందని మీడియా ప్రశ్నించింది. గత ఆరు నెలల్లో తాను 20 కేజీల బరువు తగ్గినట్టు లోకేశ్ తెలిపారు. లాక్‌డౌన్ రెండు నెలల్లో ఏడు కేజీల బరువు తగ్గినట్టు చెప్పారు. ‘నైక్ ట్రైనింగ్ క్లబ్’ మొబైల్ యాప్‌లో సూచించిన విధంగా రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడంతోపాటు చెన్నైకి చెందిన ఓ డైటీషియన్ సూచనలు పాటించి బరువు తగ్గానని వెల్లడించారు.

మహానాడుకు టీడీపీ బ్రాండ్ పసుపు చొక్కా ఎందుకు ధరించలేదంటే.. చొక్కాలన్నీ లూజైపోయాయని, లాక్‌డౌన్ కారణంగా షాపులు తెరిచి లేవని, చొక్కాలు కుట్టేవారు కూడా లేరని సమాధానమిచ్చి మరింత ఆశ్చర్యానికి గురి చేశారు.



Next Story