జగన్ పాలనలో ఫ్యాక్షన్ వికేంద్రీకరణ: లోకేశ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-02-28 05:40:59  IST  )

<p>నిన్న విశాఖపట్టణంలో చోటుచేసుకున్న సంఘటనలపై టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన లోకేశ్&#8230; &#8216;చంద్రబాబు గారి హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది. జగన్ గారి హయాంలో ఫ్యాక్షన్ వికేంద్రీకరణ జరుగుతుంది. నిన్న విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైకాపా పెయిడ్ ఆర్టిస్టులు, ఇతర జిల్లాల నుండి తరలించిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఉత్తరాంధ్రకి ఫ్యాక్షన్ రాజకీయాలను పరిచయం చేశారు&#8217; అంటూ [&hellip;]</p>

నిన్న విశాఖపట్టణంలో చోటుచేసుకున్న సంఘటనలపై టీడీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన లోకేశ్… ‘చంద్రబాబు గారి హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది. జగన్ గారి హయాంలో ఫ్యాక్షన్ వికేంద్రీకరణ జరుగుతుంది. నిన్న విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైకాపా పెయిడ్ ఆర్టిస్టులు, ఇతర జిల్లాల నుండి తరలించిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఉత్తరాంధ్రకి ఫ్యాక్షన్ రాజకీయాలను పరిచయం చేశారు’ అంటూ ట్వీట్ చేశారు.

దానికి కొనసాగింపుగా రెండో ట్వీట్‌లో ‘ప్రతిపక్ష నాయకుడి ప్రజా చైతన్య యాత్రకి అనుమతులు ఇచ్చి అరెస్ట్ చేశారంటేనే పొలీసు వ్యవస్థని ఎంత నిష్పక్షపాతంగా నడిపిస్తున్నారో అర్థం అవుతుంది’ అంటూ పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు చంద్రబాబునాయుడుతో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుకి సంబంధించిన వీడియోలను ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.

Next Story