- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా విరాళం పది లక్షలు, నెల జీతం: నారా లోకేష్
<p>కరోనా వైరస్ నివారణకు టీడీపీ నేతలు విరాళమిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎంపీలు తమ ఎంపీ ల్యాండ్స్ నుంచి విరాళాలను ప్రకటించగా, తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కరోనా నివారణకు విరాళం ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వ్యాధి నివారణ నిమిత్తం సీఎం సహాయనిధికి విరాళం ఇవ్వాలని నిర్ణయించామని ఆయన ఆయన రెండు ట్వీట్లలో తెలిపారు. తమ కుటుంబం తరపున పది లక్షల రూపాయల విరాళమివ్వాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. అలాగే […]</p>

కరోనా వైరస్ నివారణకు టీడీపీ నేతలు విరాళమిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎంపీలు తమ ఎంపీ ల్యాండ్స్ నుంచి విరాళాలను ప్రకటించగా, తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కరోనా నివారణకు విరాళం ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వ్యాధి నివారణ నిమిత్తం సీఎం సహాయనిధికి విరాళం ఇవ్వాలని నిర్ణయించామని ఆయన ఆయన రెండు ట్వీట్లలో తెలిపారు. తమ కుటుంబం తరపున పది లక్షల రూపాయల విరాళమివ్వాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు.
అలాగే అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని, ఈ సందర్భంగా టీడీఎల్పీ సభ్యుల నెల వేతనాన్ని కరోనా సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారని వెల్లడించారు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని ఆయన సూచించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags: Tdp, mlc lokesh, nara lokesh, twitter, chandrababu naidu






