‘వారి కంట కన్నీరు మంచిది కాదు’

6

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో టీడీపీ నేత నారా లోకేశ్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోకేశ్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. గుంటూరు జిల్లా మంగళగిరి, తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాను. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు. రైతు నీళ్లలో ఉంటే వైఎస్ జగన్ ఆకాశంలో విహరిస్తున్నారు. పోయిన సంవత్సరం నష్టపరిహారం ఇంకా అందలేదు.ఇప్పుడు కనీసం నష్ట పరిహారం అంచనా కూడా జరగడం లేదు. వైకాపా ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. రైతుల పక్షాన టిడిపి పోరాటం సాగిస్తుంది. చిట్ట చివరి రైతుకి న్యాయం జరిగే వరకూ రైతులకు అండగా ఉంటాం.’ అంటూ స్పష్టం చేశారు.