- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆంధ్రప్రదేశ్‌ని ఆత్మహత్యలప్రదేశ్‌గా మార్చారు’
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారాలోకేశ్ మరోసారి విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ ట్వీట్ చేస్తూ ఓ వీడియోను అప్‌లోడ్ చేశారు. ‘సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ని ఆత్మహత్యలప్రదేశ్‌గా మార్చేశారు. వైకాపా పాలనలో సామాన్యులకు రక్షణ లేదు. వైకాపా నాయకుల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది. వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం, సాతులూరులో ఒంటరి మహిళకి జీవనాధారం అయిన హోటల్‌ని వైకాపా నాయకుడు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారాలోకేశ్ మరోసారి విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ ట్వీట్ చేస్తూ ఓ వీడియోను అప్‌లోడ్ చేశారు. ‘సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ని ఆత్మహత్యలప్రదేశ్‌గా మార్చేశారు. వైకాపా పాలనలో సామాన్యులకు రక్షణ లేదు. వైకాపా నాయకుల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుంది. వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం, సాతులూరులో ఒంటరి మహిళకి జీవనాధారం అయిన హోటల్‌ని వైకాపా నాయకుడు కబ్జా చెయ్యడానికి ప్రయత్నించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడటం దారుణం. మాలతి గారు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుంది. జగన్ రెడ్డి గారు ఇదేనా మహిళలకు మీరిచ్చే అభయం? మాలతి గారిని వేధించిన వైకాపా నేతని కఠినంగా శిక్షించి మహిళకు న్యాయం చెయ్యాలి. అంటూ నారా లోకేశ్ డిమాండ్ చేశారు.






