అలా చేయడమే మీ లక్ష్యమైతే.. ఆల్ ది బెస్ట్: నారా లోకేశ్

by  |
అలా చేయడమే మీ లక్ష్యమైతే.. ఆల్ ది బెస్ట్: నారా లోకేశ్
X

దిశ ఏపీ బ్యూరో: నన్ను టార్గెట్ చేయడమే మీ లక్ష్యమైతే ఆల్ ది బెస్ట్ అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని ఉండవల్లి అనూషకు నారా లోకేశ్ అప్పగిస్తున్నట్టు ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ఫేక్ లెటర్‌గా పేర్కొన్న లోకేశ్ ట్విట్టర్ మాధ్యమంగా దీనిపై మండిపడుతూ, “ఫేక్ బతుకులు మారవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసే 5 రూపాయిల చిల్లర కోసం సొంత తల్లి పై తప్పుడు పోస్ట్ పెట్టే నీచ స్థాయికి దిగజారిపోయింది వైకాపా పేటిఎం బ్యాచ్. యుద్ధం డైరెక్ట్ గా చేసే దమ్ములేని దద్దమ్మ జగన్ ఇలాంటి చెత్త పనులు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. జగన్ నన్ను బదనాం చెయ్యడానికి పడుతున్న కష్టంలో ఒక్క శాతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెట్టినా, ప్రజలు హర్షిస్తారు. లేదు, నన్ను టార్గెట్ చెయ్యడమే మీ లక్ష్యం అయితే ఆల్ ది బెస్ట్.!” అంటూ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed