నాని దెబ్బకు మెగా ఫ్యామిలీ వెనకడుగు వేయనుందా..?

by  |
నాని దెబ్బకు మెగా ఫ్యామిలీ వెనకడుగు వేయనుందా..?
X

దిశ , సినిమా: కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్‌లో అంతకు ముందులాగానే సినిమాల సందడి మొదలైంది. చిన్నవో పెద్దవో కాని వారానికో అర డజను చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్‌లో వరుసగా బడా హీరోలు బరిలో దిగుతున్నారు. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న విడుదల కాబోతుండగా.. డిసెంబర్ 17న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పుష్ప’తో పాటు హాలీవుడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ థియేటర్లలోకి రాబోతున్నాయి.

ఈ తరుణంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – కిరణ్ కొర్రపాటి బాక్సింగ్ డ్రామా ‘గని’ డిసెంబర్ 24న రిలీజ్ చెయ్యలనుకున్నారు. కానీ అదే రోజున నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా పోటీగా రానుంది. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ అదిరిపోయింది. దీంతో నానిని వెనక్కి తగ్గాలని మెగా ఫ్యామిలీ రిక్వెస్ట్ చేసినా.. ససేమిరా అనడంతో.. ‘గని’ సినిమా వాయిదా వేయాలనుకుంటున్నారని టాక్.


Next Story

Most Viewed