నాని ‘వి’ అప్‌డేట్!

by  |
నాని ‘వి’ అప్‌డేట్!
X

నేచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబుల మల్టీ స్టారర్ ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని తొలిసారిగా నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. కానీ ఇప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేద్దామన్న జనాలు వచ్చే పరిస్థితి లేదు. 2021 వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే చాన్స్ ఉండగా, నిర్మాతలు ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ మేరకు ‘వి’ సినిమా కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఎంటర్‌టైన్ చేయనుందని వార్తలు వెలువడుతున్నాయి.

కాగా, నాని సరికొత్తగా దీనిపై అనౌన్స్‌మెంట్ ఇచ్చే చాన్స్ ఉంది. తాజాగా ఓ వీడియో అప్‌లోడ్ చేసిన నాని.. థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌తో సినిమా చూద్దామని.. మళ్లీ మళ్లీ సినిమా చూసేద్దామని చెప్తున్నాడు. గురువారం దీనిపై మరిన్ని అప్‌డేట్స్ ఇస్తానని చెప్పాడు నాని.


Next Story

Most Viewed