ఒకరోజు ముందే నాని ‘టక్ జగదీశ్’

by  |
tuck jagadeesh poster
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’ అప్‌డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఇంటెన్స్ లుక్‌తో ఉన్న నాని పోస్టర్ విడుదల చేసిన మూవీ యూనిట్.. ఈ నెల 24న నాని పుట్టినరోజు పురస్కరించుకుని ఒక్కరోజు ముందుగానే సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 23వ తేదీన సాయంత్రం 5:04 గంటలకు టీజర్ రాబోతున్నట్లు తెలిపారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘ఇంకోసారి ఇంకోసారి’కి మంచి రెస్పాన్స్‌ రాగా.. టీజర్ ఓ రేంజ్‌లో ఉండాలని కోరుతున్నారు నాని ఫ్యాన్స్.

https://twitter.com/NameisNani/status/1363097164478435335?s=20

Next Story

Most Viewed