‘వి’తో నాని సర్‌ప్రైజ్?

by  |
‘వి’తో నాని సర్‌ప్రైజ్?
X

నేచురల్ స్టార్ నాని.. ఎప్పుడూ రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంటాడు. ఇప్పటికే తన తొలి సినిమా డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటితో చేసిన సినిమా ‘వి’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ చిత్రాల షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. లాక్‌డౌన్ కారణంగా ‘వి’ సినిమా వాయిదా పడగా.. ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ వార్తొకటి ఫిలిం సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.

‘వి’ సినిమాలో నాని నెగెటివ్ పాత్రలో కనిపించబోతుండగా.. హీరో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో నాని.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నాడట. నాని మిలిటరీ మేజర్‌గా కనిపించే సీక్వెన్స్‌లు సినిమాకు అసెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ ప్లే చేసేందుకు నాని.. లుక్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నాడని సమాచారం. ఇదే నిజం ఐతే నాని రొటీన్ సినిమాలు చేస్తున్నాడన్న వారికి సరైన సమాధానం ఇచ్చినట్లు అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్.


Next Story

Most Viewed