నేచురల్ స్టార్.. ‘అంటే సుందరానికీ’

by  |
నేచురల్ స్టార్.. ‘అంటే సుందరానికీ’
X

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ కలిసి నటించబోతున్న మూవీ టైటిల్ రివీల్ అయింది. ‘అంటే సుందరానికీ’ అనే పేరుతో సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్.. అఫిషియల్ కర్టైన్ రైజర్ కూడా రిలీజ్ చేసింది. ఈ వీడియోను అబ్జర్వ్ చేస్తే.. నాని ఇందులో గాసిప్స్ క్రియేట్ చేయడం, వాటిని స్ప్రెడ్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపుతుంటాడని తెలుస్తోంది. అంతేకాదు నానికి అనుకోకుండా విదేశాలకు వెళ్లే చాన్స్ వస్తుందని కూడా అర్థమవుతోంది. ఫుల్ ఆఫ్ స్మైల్స్, లవ్‌తో నిండిపోయే ఈ సినిమా 2021 చివరలో రిలీజ్ కానుండగా.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

కర్టైన్ రైజర్ చూశాక నానికి ‘పిల్ల జమిందార్’ లాంటి మరో డిఫరెంట్ యాంగిల్ మూవీ పడిందని, బ్లాక్ బస్టర్ కంపల్సరీ అంటూ.. ఎక్స్ ప్రెషన్ క్వీన్ నజ్రియాకు వెల్‌కమ్ చెప్తున్నారు ఫ్యాన్స్. 2020లో కరోనా వల్ల లాస్ అయిన స్మైల్స్ అన్నింటినీ 2021లో ‘అంటే సుందరానికీ’ సినిమాతో కవర్ చేస్తామని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రామిస్ చేసింది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ కాగా.. రవితేజ గిరిజల ఎడిటర్.



Next Story