నానితో నజ్రియా టాలీవుడ్ ఎంట్రీ

by  |
నానితో నజ్రియా టాలీవుడ్ ఎంట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం నానికి 28వ సినిమా. వివేక్ ఆత్రేయ ఈ మూవీ డైరెక్టర్. ఇక ఈ దీపావళికి తెలుగు సినిమా కుటుంబానికి మరో వ్యక్తిని కలుపుతున్నామని తెలుపుతూ..ఈ చిత్రంలో హీరోయిన్ గురించి వెల్లడించారు. ‘రాజా రాణి’ ఫేం నజ్రియా ఫహద్ ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు తెలిపారు. ఈ నెల 21న సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉండబోతుందని..డేట్‌మార్క్ చేసుకోవాలని సూచించారు నాని. ఆలోగా హ్యాపీ దీపావళి అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అంటే ..’’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ అప్‌డేట్స్ ఇస్తుండగా.. సినిమా టైటిల్ కూడా ఈ ప్రాసలోనే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.

https://twitter.com/MythriOfficial/status/1327115422945054721?s=19

ఈ ప్రకటనపై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నజ్రియాకు గ్రాండ్ వెల్ కమ్ చెప్తున్న ఆడియన్స్..తనను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడటం సంతోషంగా ఉందంటున్నారు. ఇక నాని ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ సినిమాలతో బిజీగా ఉండగా..ఈ ప్రాజెక్టులు పూర్తి కాగానే కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడని సమాచారం.


Next Story

Most Viewed