‘OH BABY’ తర్వాత ‘అన్నీ మంచి శకునాలే’ : నందినీ రెడ్డి

by  |
‘OH BABY’ తర్వాత ‘అన్నీ మంచి శకునాలే’ : నందినీ రెడ్డి
X

దిశ, సినిమా : బ్లాక్ బస్టర్ ‘ఓ బేబీ’ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది డైరెక్టర్ నందినీ రెడ్డి. రీసెంట్‌గా ‘ఏక్ మినీ కథ’ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ హీరో కాగా మాళవికా నాయర్‌ హీరోయిన్. స్వప్న సినిమాస్, మిత్రవింద మూవీస్ బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే’ టైటిల్ ఖరారు చేశారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్ట్ విడుదల చేసిన మేకర్స్.. కాస్ట్ అండ్ క్రూ డిటెయిల్స్ కూడా షేర్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్న సినిమా టైటిల్ రివీల్‌కు ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లోని ‘అన్నీ మంచి శకునములే’ సాంగ్ ట్యూన్ యూజ్ చేయడం విశేషం. లక్ష్మీ భూపాలా డైలాగ్ రైటర్ కాగా.. స్క్రీన్‌ప్లే రైటర్‌గా దావూద్ వర్క్ చేయనున్నారు.

Next Story

Most Viewed