ఓటీటీలో సత్తా చాటుతున్న 'నాంది'

by  |
ఓటీటీలో సత్తా చాటుతున్న నాంది
X

దిశ, వెబ్ డెస్క్:టాలీవుడ్ లో కామెడీ చిత్రాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్. ఒకప్పుడు తన సినిమాలతో విజయ పథకాన్ని ఎగరవేసిన ఈ హీరో గత కొంత కాలం పరాజయాలను చవిచూస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తన పంథా మార్చుకొని ఒక సరికొత్త కథ ‘నాంది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టుకొని నరేష్ కెరీర్ లోనే భారీ హిట్ ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రం వెండి తెరమీదే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోనూ తన సత్తా చాటుతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ దక్కించుకుంది. మార్చి 12 నుండి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పటివరకు 100 మిలియన్ వ్యూయర్ షిప్స్ ని సొంతం చేసుకుంది. ఈ విధంగా నరేష్ మరో కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసాడనే చెప్పాలి. మొత్తానికి అల్లరి నరేష్ ‘నాంది’ చిత్రంతో కొత్త రికార్డులకు నాంది పలుకుతున్నాడని ప్రశంసలు అందుతున్నాయి.


Next Story

Most Viewed