- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాక్టర్ ప్రదీప్‌కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పిల్లల వైద్యడు, ఐఎంఏ కార్యదర్శి కూరపాటి ప్రదీప్ సామాజిక సేవలను గుర్తించి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్ చేశారు. తలసేమియా వ్యాధి సోకిన పిల్లల పట్ల డాక్టర్ కూరపాటి ప్రదీప్ చేస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సేవ చేయటం మహా భాగ్యమని, అందులోనూ తలసేమియా బాధిత పిల్లలకు సేవలు చేయడం గొప్పతనం అన్నారు. ఇలాంటి సేవలు మరింత విస్తృతంగా అందించాలని, ఒకవైపు డాక్టర్‌గా.. మరోవైపు […]</p>

X
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పిల్లల వైద్యడు, ఐఎంఏ కార్యదర్శి కూరపాటి ప్రదీప్ సామాజిక సేవలను గుర్తించి సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్ చేశారు. తలసేమియా వ్యాధి సోకిన పిల్లల పట్ల డాక్టర్ కూరపాటి ప్రదీప్ చేస్తున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సేవ చేయటం మహా భాగ్యమని, అందులోనూ తలసేమియా బాధిత పిల్లలకు సేవలు చేయడం గొప్పతనం అన్నారు. ఇలాంటి సేవలు మరింత విస్తృతంగా అందించాలని, ఒకవైపు డాక్టర్‌గా.. మరోవైపు సామాజిక సేవలో పాలుపంచుకోవాలని ప్రదీప్‌కు బాలకృష్ణ సూచించారు. కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా ఉండాలని విన్నవించారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత నల్లమల రంజిత్ కోరిక మేరకు ఖమ్మం జిల్లాకు విచ్చేసి పలు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు బాలకృష్ణ తెలిపారు.
Next Story






