- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య బర్త్ డే.. ‘అఖండ’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
<p>దిశ, సినిమా : నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదినం(జూన్ 10) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ నుంచి కూల్ లుక్ రిలీజ్ చేశారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి బుధవారం సా. 04:36 నిమిషాలకు కొత్త పోస్టర్ విడుదల అయింది. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత.. హీరో బాలకృష్ణకు పుట్టినరోజు […]</p>

దిశ, సినిమా : నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదినం(జూన్ 10) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ నుంచి కూల్ లుక్ రిలీజ్ చేశారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి బుధవారం సా. 04:36 నిమిషాలకు కొత్త పోస్టర్ విడుదల అయింది. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత.. హీరో బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అఖండ’ టైటిల్ రోర్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయని, వారి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందని హామీ ఇచ్చారు. దాదాపు చిత్రీకరణ పూర్తయిందని.. బ్యాలెన్స్ ఫిల్మింగ్ త్వరలో ప్రారంభించి, ఆ తర్వాత చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి మాసివ్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మూవీని శుభముహూర్తాన ప్రేక్షకదేవుళ్ల ముందుకు తీసుకొస్తామన్నారు. కాగా ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. సి. రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్.






