సవాళ్లకు మహేశ్ సిద్ధమే : నమ్రత

by  |
సవాళ్లకు మహేశ్ సిద్ధమే : నమ్రత
X

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటి వరకు చాలా ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేశాడు. అయితే ప్రతీ యాడ్‌లోనూ యంగ్‌గా, మరింత హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ప్రయత్నించే మహేశ్.. ఈ సారి మరింత సరికొత్తగా కనిపించాడు. ప్రస్తుతం థమ్సప్ యాడ్ షూట్ కోసం మీసకట్టు, లుంగీతో రెడీ కాగా.. ఆ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఈ విషయమై పోస్ట్ పెట్టింది నమ్రత శిరోద్కర్.

యాడ్ కోసం మీసం పెట్టుకున్న మహేశ్.. సూపర్‌గా కనిపిస్తున్నప్పటికీ దానితో ఏ మాత్రం కంఫర్ట్‌గా లేరని తెలిపింది. కానీ నిపుణులు మనతో ఉన్నప్పుడు ఎవరు మాత్రం చాలెంజ్ స్వీకరించకుండా ఉంటారు చెప్పండి. నిపుణుల సమక్షంలో సవాళ్ళను స్వీకరించేందుకు అందరూ సిద్ధమే కదా! అని తెలిపింది.


Next Story

Most Viewed