పాటతో పాపను నవ్విస్తున్న మహేష్..

by  |
పాటతో పాపను నవ్విస్తున్న మహేష్..
X

ప్రతీ తండ్రికి కూతురు అంటే చాలా స్పెషల్.. ఏ కూతురికైనా నాన్నే హీరో. సినీ ఇండస్ట్రీలో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్‌షిప్ అంటే వెంటనే గుర్తొచ్చేవారు సూపర్ స్టార్ మహేష్ బాబు, సితార. లాక్‌డౌన్‌లో వీరిద్దరి క్యూట్ ఫోటోస్, వీడియోస్ నెటిజన్లను అలరించాయి. మహేష్‌తో సీతు పాప ఆడుకోవడం, తండ్రికి మసాజ్ చేయడం లాంటి వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మెమోరీ థెరపీ పేరుతో సితార చిన్నప్పటి వీడియోలు షేర్ చేసే నమ్రత.. తాజాగా తండ్రీకూతుళ్లు అల్లరి చేస్తున్న మరో వీడియోను పోస్ట్ చేసింది.

https://www.instagram.com/p/CAPCdPjDvb_/?utm_source=ig_web_copy_link

ఈ వీడియోలో మహేష్ సితారను నవ్వించేందుకు బొమ్మతో ఆడిస్తూ పాట పాడుతుండటం, సీతు పాప క్యూట్ స్మైల్స్… చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదంటున్నారు ఫ్యాన్స్. మహేష్‌లో చిన్న పిల్లాడిని బయటకు తీసేది సితార మాత్రమేనని నమ్రత చెప్తుండగా.. ‘నాన్న నా కోసం పాట పాడాడు’ అంటూ తన సోషల్ మీడియా హాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేసింది సితార ఘట్టమనేని.


Next Story

Most Viewed