మహేష్ ఇంట్లో వినాయకచవితి వేడుకలు (వీడియో)

by  |
మహేష్ ఇంట్లో వినాయకచవితి వేడుకలు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మట్టితో చేసిన గణపయ్యకు మహేష్ భార్య నమ్రతతో పాటు కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితార భక్తి శ్రద్దలతో పూజించారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో పూజలు చేసిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న విజువల్స్ ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాత్రం ఎక్కడ కనపడకపోవడం గమనార్హం. మహేష్ అభిమానులు ఈ వీడియోకి కామెంట్స్, లైక్స్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడవచ్చు.

https://www.instagram.com/p/CEbk5cnDMs0/


Next Story