ఇక తెలంగాణ కాంగ్రెస్‌దే.. ఉత్తమ్ సెన్సేషనల్ కామెంట్స్

by  |
Nalgonda MP Uttam Kumar Reddy
X

దిశ, కోదాడ: టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళనకు సిద్ధం కావాలని మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యపేట జిల్లా మునగాల, నడిగూడెం మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి ‘దళితబంధు’ పథకం తెచ్చి మరోసారి దళితులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసమే వాగ్దానాలు చేస్తున్నారని అన్నారు. ఇక, తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని వెల్లడించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే కృష్ణా జలాలు తెలంగాణ రైతాంగానికి దక్కకుండా పోతున్నాయని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.

2023లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని అభిప్రాయపడ్డారు. 1994 నుండి నేటివరకూ కోదాడ, హుజూర్‌నగర్ నియోజక వర్గాల అభివృద్ధికి మీ అందరి సహకారంతోనే జరిగిందని అన్నారు. గత కొంతకాలంగా పార్లమెంట్ స్తంభించిందని, కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిల్ నుంచి పెగాసస్ అనే సాఫ్ట్‌వేర్‌ తెచ్చి ప్రతిపక్ష నాయకులపై జడ్జీలపై ఉపయోగించి రాజ్యాంగ హక్కులను కాలరాశారన్నారు. గ్రామస్థాయి నుండి మండల, జిల్లా రాష్ట్రస్థాయిలో కమిటీలు వేసుకొని కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆవు దొడ్డి ధర్మమూర్తి, కోదాడ పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు, మునగాల మండల అధ్యక్షులు జైపాల్ రెడ్డి, నడిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు ఊటుకూరి వెంకట్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వేపూరి సుధీర్, బుచ్చి పాపయ్య, కోటేశ్వరరావు శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed