నలంద కిశోర్ మృతి… పోలీసులేమన్నా చేశారా?

by  |
నలంద కిశోర్ మృతి… పోలీసులేమన్నా చేశారా?
X

దిశ, ఏపీ బ్యూరో: ఈ నెల ఆరంభంలో సోషల్ మీడియాలో అధికార పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా సీఐడీ పోలీసులు వేకువ జామునే అదుపులోకి తీసుకుని, మరుసటి రోజు విడిచిపెట్టిన నలంద కిశోర్ మృతి చెందడం వైజాగ్‌లో కలకలం రేపుతోంది. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అనుచరుడైన నలంద కిశోర్‌.. మూడు వారాల క్రితం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను షేర్ చేశారు. దీంతో గంటా సీఐడీ కార్యాలయానికి వెళ్లగా ఆయనను లోనికి అనుమతించని సంగతి తెలిసిందే.

ఆ సమయంలో నలంద కిశోర్‌ని వైజాగ్ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ న్యాయస్థానంలో హాజరుపర్చి, విచారించి విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యానికి గురయ్యారని ఆయన బంధువులు చెబుతున్నారు. ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ ఉదయం ప్రాణాలు విడిచారు. అయితే ఆయన కేవలం జ్వరంతోనే చనిపోయారా? సుదూర ప్రయాణంలో పోలీసులు ఏమైనా చేశారా? ఆయనది సాధారణ మరణమా? లేక సాధారణ మరణంగా చిత్రీకరించిన హత్యా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.



Next Story