నగ్నంగా మహిళలు.. అటుగా వెళ్లిన యువకులు ఏం చేశారంటే..

by  |
నగ్నంగా మహిళలు.. అటుగా వెళ్లిన యువకులు ఏం చేశారంటే..
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు గానీ, పురుషులు గానీ నగ్న ప్రదర్శలు చేయడం నేరమే. అది ఏ దేశమైన చర్యలు తప్పవు. ముస్లిం దేశాల్లో ఇంకా కఠిన చట్టాలు అమలు చేస్తారు. ముస్లిం మహిళలు కనీసం ముఖం చూపించడానికి కూడా అక్కడి చట్టాలు అంగీకరించవు. ఏడారి దేశం దుబాయ్‌లో మరీ కఠిన చట్టాలు ఉంటాయి. కానీ ఆ దేశంలో మహిళలు చేసిన పనికి కంట్రీ మొత్తం షాక్ అయింది. కొంతమంది మహిళలు నగ్నంగా మారి బాల్కానీలో నిలబడడం సంచలనంగా మారింది.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అది దుబాయ్‌లోని మెరీనా మార్కెట్‌ ఏరియా. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. రోడ్డును ఆనుకుని ఉన్న ఓ అపార్టుమెంటు బాల్కనీలోకి పగటిపూట కొంతమంది మహిళలు వచ్చారు. తమ ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా ఆ బాల్కనీలోనే కాసేపు నిల్చున్నారు. రోడ్డుపై వచ్చిపోయే వారిని తిలకించారు.

అయితే ఈ విషయాన్ని గమనించిన కొంతమంది యువకులు ఆ నగ్న మహిళలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇంకేముంది.. అసలే నగ్న వీడియో.. క్షణాల్లో వైరల్‌గా మారాయి. ఆ నగ్న వీడియోలు పోలీసులకూ చేరడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే మెరీనా మార్కెట్‌ ఏరియా చేరుకుని మహిళలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

అసభ్య ప్రవర్తనతో ప్రజలను అసౌకర్యానికి గురిచేసినందుకు సదరు మహిళలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘ఎమిరాటి సంస్కృతీ సంప్రదాయాలను కాలరాసే విధంగా ఉన్న ఇలాంటి విలువలు లేని ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. అందుకే క్రిమినల్‌ కేసు నమోదు చేశాం’’ అని ఒక ప్రకటన ద్వారా పోలీసులు వెల్లడించారు. కఠినమైన షరియా చట్టాలు, ఆంక్షలు ఉండే దుబాయ్ లో ఇలాంటి పనులకు 6 నెలల వరకు జైలు శిక్షతో పాటు 5 వేల దీరాంలు జరిమానా విధించే అవకాశం ఉంది. అదేవిధంగా అశ్లీల చర్యలకు పాల్పడ్డ మహిళలపై షరియా పెద్దలు కఠిన శిక్షలు విధించే అవకాశముంది.


Next Story

Most Viewed