నడిబజారులో నగ్నంగా..

by  |
నడిబజారులో నగ్నంగా..
X

దిశ, వెబ్‌డెస్క్ : పబ్లిసిటీ కోసం కొందరు సిగ్గుమాలిన పనులకు దిగుతున్నారు. నగ్నంగా నడివీధుల్లో తిరుగుతూ రచ్చ చేస్తున్నారు. మొలకు కట్టుకోవాల్సిన బట్టలను తలకు కట్టుకోని తల లేని పనులు చేస్తున్నారు. అమెరికాలో ఓ వ్య‌క్తి ఒంటిపై నూలు పోగు లేకుండా త‌ల‌కు పాండా మాస్క్ ధ‌రించి న‌డిరోడ్డుపై స్కేటింగ్ చేశాడు. అమెరికాలోని 670 హైవే మీద క‌నిపించిన ఈ దృష్యం.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోను గ‌మ‌నిస్తే న‌గ్నంగా ఉన్న వ్య‌క్తి సెల్ఫీ స్టిక్‌తో ఫొటోలు , వీడియోలు తీసుకుంటున్న‌ాడు.అతడి చర్యపై నెటిజర్లు ఫైర్ అవుతున్నారు. తాను స్కేటింగ్ చేయాలంటే దుస్తులు ధరించాలని, నగ్నంగా సెల్ఫీలు తీసుకోవాలంటే నాలుగు గోడల మధ్య తీసుకోవచ్చని ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా టెక్నాలజీని ఇలా నగ్నంగా యూజ్ చేయడం సరి కాదని మండిపడుతున్నారు.

Next Story

Most Viewed