నాగ్‌కు ‘వైల్డ్ డాగ్’ బర్త్‌డే విషెస్

by  |
నాగ్‌కు ‘వైల్డ్ డాగ్’ బర్త్‌డే విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్:

కింగ్ నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకొని టాలీవుడ్ సెలెబ్రిటీస్ బెస్ట్ విషెస్ అందించారు. మన్మథుడు మరింత ఆరోగ్యంగా ఉండాలని.. తనలో ఉన్న పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఎల్లప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా నాగ్ నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ మూవీ యూనిట్ కూడా బెస్ట్ విషెస్ అందిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.

‘వైల్డ్ డాగ్’ యాక్షన్‌లోకి దిగాడంటూ పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. 12 మిషన్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన డేర్ డెవిల్ ఏసీపీ విజయ్ వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి వైల్డ్ డాగ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ఫిల్మ్ కాస్ట్‌ను పరిచయం చేసింది. అలీ రెజా, ఆర్య పండిట్, కలెబ్ మాథ్యూస్, హశ్వంత్ మనోహర్, రుద్ర గౌడ్‌లు ఈ సినిమాలో నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుపుతూనే.. ఎన్ఐఏలో వారి డెసిగ్నేషన్స్ కూడా వెల్లడించింది.

విజయ్ వర్మ అలియాస్ వైల్డ్ డాగ్‌గా పిలువబడే నాగ్.. ఈ లుక్‌లో నిజంగానే చాలా వైల్డ్‌గా కనిపించగా, ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సారి హిట్ పక్కా అని కన్‌ఫర్మ్ అయిపోయారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.



Next Story