పుట్టినరోజున గోస్ట్ గెటప్‌లో అక్కినేని

by  |
Nagarjuna, Ghost
X

దిశ, సినిమా: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆయన లేటెస్ట్ ఫిల్మ్ నుంచి అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది గోస్ట్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. రీసెంట్‌గా ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ బర్త్‌డే రోజునే ప్రీ-లుక్ పోస్టర్ విడుదల చేసినప్పటికీ.. అందులో నాగార్జున లుక్ రివీల్ చేయలేదు. అయితే లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన లుక్‌లో చేతిలో కత్తితో ఉగ్రరూపంలో ఉన్న నాగ్.. శత్రువులను వేటాడుతుండగా, వారు శరణు కోరుతున్నట్టుగా ఉంది. ఈ సంగతి పక్కనబెడితే, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న లండన్ బిగ్ బెన్ మూవీపై అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నారాయన్ దాస్ కే నారంగ్, పుస్కూరు రాంమోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Next Story