డిసెంబర్‌లో సెట్లోకి ‘బంగార్రాజు’

by  |
డిసెంబర్‌లో సెట్లోకి ‘బంగార్రాజు’
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘సోగ్గాడే చిన్ని నాయనా’.. అక్కినేని నాగార్జున ఫేమ్‌కు తగ్గట్లుగా డిజైన్ చేసిన సినిమా. కింగ్ నాగార్జున అల్లరి, చిలిపితనం, అమాయకత్వం, మంచితనం సమపాళ్లలో నిండిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకుంది. బంగార్రాజు పాత్రలో నాగ్ నవరసాలు పండించగా.. సినిమాకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ చేస్తామని.. ‘బంగార్రాజు’ టైటిల్‌తోనే సినిమా ఉంటుందని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ప్రకటించారు.

కాగా, ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ కాబోతుందని, సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమా మేజర్ పార్ట్ కంప్లీట్ చేయనున్నారని సమాచారం. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ మూవీపై త్వరలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ పూర్తి చేసిన నాగ్.. బంగార్రాజు కోసం ప్రిపేర్ అవుతున్నారని టాక్. ఇక ‘వైల్డ్ డాగ్‌’లో ఎన్ఐఏ ఏజెంట్‌గా డిఫరెంట్ రోల్ చేస్తున్న నాగ్.. సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అహిషోర్ సోలోమన్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.



Next Story

Most Viewed