'వైల్డ్ డాగ్'కు నాగ్ గుడ్ బై..

by  |
వైల్డ్ డాగ్కు నాగ్ గుడ్ బై..
X

దిశ, వెబ్ డెస్క్: కింగ్ నాగార్జున అక్కినేని ‘వైల్డ్ డాగ్’ మూవీ షూటింగ్ పూర్తయింది. దాదాపు 20 రోజులపాటు హిమాలయాల్లో లాస్ట్ షెడ్యూల్‌లో పాల్గొన్న నాగ్..ఈ సినిమాకు సంబంధించి తన పార్ట్ పూర్తి అయినట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు. మనాలిలో వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నట్లు తెలిపిన నాగ్.. టాలెంటెడ్ టీమ్, హిమాలయాలకు గుడ్ బై చెప్తున్నందుకు బాధగా ఉందని తెలిపారు. మ్యాటీనీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు అహిషోర్ సల్మాన్ డైరెక్టర్. అలీ రెజా, సయామీ ఖేర్, మయాంక్ పరాఖ్, ప్రదీప్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా నాగ్‌కు జోడీగా కనిపించనుంది.

నాగ్..త్వరలో బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు. రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్, నాగ్ -మౌనీరాయ్‌పై రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉండగా..ముంబైలో షూటింగ్ జరగనుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed