బిగ్ బాస్‌4’ ప్రేక్షకులకు నాగ్ థాంక్స్ నోట్

by  |
బిగ్ బాస్‌4’ ప్రేక్షకులకు నాగ్ థాంక్స్ నోట్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్‌ 4.. హోస్ట్‌గా తనకు అత్యంత సంతృప్తినిచ్చిందన్న కింగ్ నాగార్జున, ఈ సందర్భంగా ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గత 12 వారాలుగా తెలుగు రాష్ట్రాల్లోని 83 శాతం మంది ప్రజలు బిగ్ బాస్‌ షోను వీక్షించారని.. 20 ప్లస్ టీవీఆర్‌‌తో బిగ్‌బాస్‌ చరిత్రలోనే అతిపెద్ద ఆవిష్కరణగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. స్టార్ మా ప్రైమ్ టైమ్ ఇప్పుడు రా. 11 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ప్రతీ వారం కోట్లాదిమంది వీక్షకులకు వినోదం కలిగించడమే అత్యుత్తమ సంతృప్తిని కలిగించే విషయమని.. కరోనా లాంటి పాండమిక్ టైమ్‌లోనూ ఆ బాధను మరిపించేలా షో చేయడం మరింత ఆనందాన్నిస్తుందన్నారు నాగ్.



Next Story

Most Viewed