‘ఆ తండాల్లో… సరైన రహదారులు లేవు’

by Shyam |   (  Updated:2020-09-06 09:19:26  IST  )

<p>దిశ, నాగార్జునసాగర్: నియోజకవర్గంలో ఉన్న రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాల్లో తన వాణి వినిపిస్తా అని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. ఆదివారం హాలియాలో ఆయన ‘దిశ’ ప్రతినిధితో మాట్లాడుతూ&#8230; కొన్ని గిరిజన తండాల్లో సరైన రహదారులు లేవన్నారు. వర్షాల మూలంగా కొన్ని రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వీటికి మరమ్మతులు చేసేందుకు మంత్రిని నిధులు విడుదల చేయాలని కోరనున్నట్టు తెలిపారు. దాంతో పాటు నియోజకవర్గంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తిగా వినియోగించుకునేందుకు నిధులు [&hellip;]</p>

‘ఆ తండాల్లో… సరైన రహదారులు లేవు’
X

దిశ, నాగార్జునసాగర్: నియోజకవర్గంలో ఉన్న రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాల్లో తన వాణి వినిపిస్తా అని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. ఆదివారం హాలియాలో ఆయన ‘దిశ’ ప్రతినిధితో మాట్లాడుతూ… కొన్ని గిరిజన తండాల్లో సరైన రహదారులు లేవన్నారు.

వర్షాల మూలంగా కొన్ని రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వీటికి మరమ్మతులు చేసేందుకు మంత్రిని నిధులు విడుదల చేయాలని కోరనున్నట్టు తెలిపారు. దాంతో పాటు నియోజకవర్గంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తిగా వినియోగించుకునేందుకు నిధులు విడుదల చేయాలని కోరతామన్నారు. వరద కాల్వ ద్వారా మరికొన్ని ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Next Story