- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుడి దారుణ హత్య
by Batti.Sumithra |
<p>దిశ, నాగార్జునసాగర్: హాలియా పట్ణణ సమీపంలో సాగర్ ఎడమకాల్వ అక్విడెక్ట్ ప్రాంతంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన యానక ప్రభాకర్ (32) గురువారం సాయంత్రం ఎడమకాల్వ కట్టపై దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం సాయంత్రం 5 నుండి 5.30గంటల సమయంలో ప్రభాకర్ కాల్వ కట్టపైకి వచ్చినట్టుగా సీసీ పుటేజీల్లో ఉన్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఓయువకుడు అటువైపే వెళ్లినట్టు పోలీసులు […]</p>

X
దిశ, నాగార్జునసాగర్: హాలియా పట్ణణ సమీపంలో సాగర్ ఎడమకాల్వ అక్విడెక్ట్ ప్రాంతంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన యానక ప్రభాకర్ (32) గురువారం సాయంత్రం ఎడమకాల్వ కట్టపై దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం సాయంత్రం 5 నుండి 5.30గంటల సమయంలో ప్రభాకర్ కాల్వ కట్టపైకి వచ్చినట్టుగా సీసీ పుటేజీల్లో ఉన్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఓయువకుడు అటువైపే వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభాకర్‌కు వివాహం కాగా భార్య గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






