క్రిస్మస్‌కు వచ్చేస్తున్న బంగార్రాజు?

by  |
క్రిస్మస్‌కు వచ్చేస్తున్న బంగార్రాజు?
X

దిశ, వెబ్‌డెస్క్:
కింగ్ నాగార్జున ‘మన్మథుడు 2’ సినిమా తర్వాత ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. ఈ సినిమా అభిమానులను నిరాశపరచగా.. మంచి స్క్రిప్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు గ్యాప్ తీసుకున్నాడు నాగ్. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో ‘బంగార్రాజు’ పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో… అదే పేరును టైటిల్‌గా ఖరారు చేసి సినిమాను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడని సమాచారం. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రానున్న సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా… జూన్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. కాగా బంగార్రాజు క్రిస్మస్ కానుకగా వస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా కీలక పాత్ర చేస్తుండగా… చైతూకు జోడిగా సమంత నటించే ఛాన్స్ ఉందట. నాగ్‌కు జోడిగా ఎవర్ గ్రీన్ రమ్యకృష్ణ కనిపించనుందని సమాచారం. పకడ్బందీ స్క్రిప్ట్‌తో క్రిస్మస్‌కు వచ్చేస్తున్న కింగ్.. ఈ సారి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి మరి.

tags :King Nagarjuna, Nagarjuna, Kalyan Krishna, Naga Chaitanya, Bangarraju, Soggade Chinni Nayana



Next Story

Most Viewed