నాగ్ సంతోషానికి కారణం?

by  |
నాగ్ సంతోషానికి కారణం?
X

చిన్నప్పుడే సిసింద్రీ సినిమాతో హిట్ కొట్టిన బుడతడు అఖిల్ అక్కినేని. కానీ హీరోగా మాత్రం ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా అందుకోలేక పోయాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను.. ఇలా మూడు సినిమాలు తీసినా సరే.. తన కెరీర్‌లో హిట్ అనే పదమే వినిపించకుండా పోయింది. బాక్సాఫీస్ వద్ద ఒక్క సినిమా కూడా సక్సెస్ కాకుండా పోయింది. దీంతో కొడుకు కెరియర్ గురించి బాధలో ఉన్న నాగార్జున.. ఈసారి మాత్రం హిట్ పక్కా అని బల్లగుద్ది చెప్తున్నాడట.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న అఖిల్ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రభుత్వ అనుమతితో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సినిమా రఫ్ ఎడిట్ జరిగిందట. ఈ చిత్రాన్ని చూసిన నాగ్.. ఈ సారి అఖిల్ హిట్ కొట్టడం ఖాయమని సంతోషంగా ఉన్నాడట.

Next Story

Most Viewed