థాంక్యూ.. బిగ్ బాస్‌లో కలుద్దాం : నాగ్

by  |
థాంక్యూ.. బిగ్ బాస్‌లో కలుద్దాం : నాగ్
X

కింగ్ నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని సెలెబ్రిటీలు, అభిమానులు ఆయనకు బెస్ట్ విషెస్ అందించారు. సోషల్ మీడియా మొత్తం మన్మథుడి బర్త్‌డే విషెస్‌తో నిండిపోగా.. సీనియర్ అక్కినేని ఫ్యాన్స్, జూనియర్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌కు థాంక్స్ చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు నాగ్.

https://twitter.com/iamnagarjuna/status/1299656079907856385?s=19

శనివారం 61వ పుట్టినరోజు జరుపుకున్న తనకు ఎంతో మంది ప్రేమ, అభిమానంతో విష్ చేయడంతో చాలా సంతోషంగా ఉన్నానని ధన్యవాదాలు తెలిపారు నాగ్. ఇంకో విషయంలోనూ చాలా హ్యాపీగా ఉన్నానన్న నాగ్.. ఐదున్నర నెలల తర్వాత బిగ్ బాస్ ద్వారా మీ ముందుకు రాబోతున్నానని తెలిపారు. బిగ్‌బాస్ సీజన్ 3 లాగే ఈ సారి కూడా మీ ప్రేమ, ఆశీర్వాదంతో ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. బిగ్ బాస్ హౌస్‌లో కలుసుకుందామని బై చెప్పాడు నాగ్.

‘వైల్డ్ డాగ్’తో పాటు ‘బిగ్ బాస్ సీజన్ 4’ షూటింగ్ సోమవారం నుంచి స్టార్ట్ కాబోతుందన్న నాగ్.. మళ్లీ బిజీ కాబోతున్నందుకు సూపర్ హ్యాపీగా ఉందని తెలిపారు.



Next Story

Most Viewed