ప్రధాని, సీఎంలూ చేయలేని పనిని జగన్ చేశారు : ఎమ్మెల్యే రోజా

by  |
ప్రధాని, సీఎంలూ చేయలేని పనిని జగన్ చేశారు : ఎమ్మెల్యే రోజా
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నగరి ఎమ్మెల్యే రోజా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, ఇతర సీఎంలు చేయలేని పనిని ముఖ్యమంత్రి జగన్ చేసి చూపించారని వ్యాఖ్యానించారు. చరిత్రలోనే తొలిసారిగా మహిళల కోసం బడ్జెట్ తెచ్చారన్నారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు బడ్జెట్‌ను బహిష్కరించి మహిళా వ్యతిరేకి అనిపించుకున్నారని రోజా మండిపడ్డారు. సీఎం జగన్‌కు మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే రోజా తెలిపారు.

Next Story

Most Viewed